logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పవన్ కళ్యాణ్ అభిమానిని ఆదుకున్న సీఎం జగన్.. భారీ సాయం!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్ ప్రాణదాతగా మారారు. నాగేంద్ర(26) అనే యువకుడు కొంత కాలంగా రక్త సంభందిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల అతనికి అత్యవసర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెండు రోజులుగా ఈ వార్త వైరల్ గా మారింది. జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ తో పాటుగా పవన్ కళ్యాణ్ అకౌంట్ కు కూడా దీనిని టాగ్ చేసారు.

ఈ ట్వీట్ పై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ అభిమాని వైద్యానికి అవసరమైన సహాయం చేయాలని కోరుతూ ఈ విషయాన్ని ముఖ్యంమత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి నాగేంద్రకు రూ. 10 లక్షలను మంజూరు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాగేంద్రకు ప్రభుత్వ సహాయంతో స్టెమ్ సెల్ థెరపీ జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.

Related News