logo

  BREAKING NEWS

చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |  

ఆ ఉద్యోగులకు శుభవార్త.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ హాజగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీలోని ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఆప్కాస్)ని ఏర్పాటు చేసారు. నేడు తాడేపల్లిగూడెంలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారని గుర్తుచేశారు. వారికోసమే ఈరోజు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించామన్నారు. దీని ద్వారా ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగనివ్వమని.. ఇప్పటి నుండి దళారులకు, పైరవీలకు పాల్పడే వారికి చోటు లేదన్నారు.

ఉద్యోగాల నియామక ప్రక్రియలో పూర్తిగా పారదర్శకత ఉంటుందని హామీ ఇచ్చారు. ఆప్కోస్ ను చైర్మెన్ గా చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శుల్లో ఎవరో ఒకరిని నియమిస్తారు కాబట్టి అవినీతికి తావులేదన్నారు. ఈ కార్యక్రమ ద్వారా ప్రస్తుతానికి 50449 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచుతామని వెల్లడించారు.

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీకు జీతాలను అందజేస్తామన, పీఎఫ్ లను కూడా అమలు చేస్తామన్నారు. గతంలో 20 మంది ఉద్యోగులు ఉండాల్సిన చోట 15 మందిని నియమించి వారి జీతాలను కూడా కాంట్రాక్టర్లే తీసుకునేవారని ఇకపై లంచాలు, అవినీతికి తావులేకుండా ఉద్యోగులకు పూర్తి భద్రతా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Related News