logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరాం హాజరయ్యారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం పలు విషయాలను అధికారులతో చర్చించనున్నట్టు సమాచారం. ఎన్నికలు ఎలా నిర్వహించాలి? అందుకు సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో కొదిసేపటి క్రితమే ఎన్నకల కమిషనర్ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరించక పోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని లేఖలో నిమ్మగడ్డ కోరారు.

 

Related News