ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాటలు పాడిన ఘనత ఆయనది. కరోనా కారణంగా సెప్టెంబర్ 25న బాలు అందిరినీ విడిచి వెళ్లిన సంగతి తెలిసందే. కాగా సినీ కళారంగానికి, సంగీత లోకానికి ఎనలేని సేవలు అందించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది.
నెల్లూరులోని ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్‌గా దీనిని మార్చనున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై బాలు కుమారుడు ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి గౌతమ్ రెడ్డికి ట్వీట్‌ను రీట్వీట్ చేసి.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎస్పీ బాలుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. బాలు సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై బాలు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.