logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

‘ఒక్క ఫోన్ చేస్తే సీఎంవో కార్యాలయమే కదిలివస్తుంది’.. విద్యార్థులకు జగన్ బంపర్ ఆఫర్!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నవరత్నాల్లో కీలమైన అమ్మ ఒడి పథకంలో రెండో విడత చెల్లింపుల కార్యక్రమాన్ని సోమవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదివి ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ లక్ష్యమన్నారు. పాద యాత్ర సందర్భంగా పేదింటి పిల్లలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశానన్నారు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడికి వెళ్లే పిల్లలకు రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు.

జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48,865 మంది లబ్ధిదారులకు రూ,13,023 కోట్లు జమ చేశారు. కాగా రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఈసారి రూ. 15 వేలకు బదులుగా రూ. 14 వేలు విద్యార్థులు తల్లిదండ్రుల ఖాతాలో జమ అవుతాయన్నారు. మిగిలి రూ. 1000 రూపాయలను డిటిఎఫ్ ఫండ్ కింద పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రతిఏటా ఎంతో మంది విద్యార్థినిలు టాయిలెట్లు లేక చదువు మానేస్తున్నారని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.

పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ సరిగా రాలేకపోతే విద్యార్థులు 1902 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేదంటే గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేస్తే కూడా ఏకంగా సీఎంవో కార్యాలయమే మీ దగ్గరకు కదిలి వస్తుందన్నారు. ఈ సందార్భంగా 9 నుంచి 12 వ తరగతి చదివే విద్యార్థినులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. అమ్మఒడి పథకం కింద డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే ఆ డబ్బుకు బదులుగా ల్యాప్ టాప్ ను కూడా విద్యార్థులు ఎంచుకోవచ్చన్నారు.

వసతి దీవెన పథకం అందుకుంటున్నవారికి వీటిని అందిస్తామన్నారు. ఒకో ల్యాప్ టాప్ రూ. 25 నుంచి రూ. 27 వేల వరకు ఉంటుందన్నారు. వీలైనంత తక్కువ ధరకే వీటిని అందించే విధంగా సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నామన్నారు. వచ్చే మూడేళ్ళలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టనున్నామన్నారు. అంగన్వాడీలను మార్చి వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-1, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-2లుగా చేయబోతున్నామన్నారు.

Related News