విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబోలో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఎఫ్3 సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా రన్ టైమ్ 2 గంటల 28 నిమిషాలుగా ఉంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. తమ సినిమా మొత్తం నవ్వులే నవ్వులని, కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఎఫ్2 సినిమా ఫుల్ కామెడీతో బిగ్ హిట్ సాధించినందున దాని సీక్వెల్‌గా ఎఫ్3ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 27న ఎఫ్3 రిలీజ్ కానుంది.