logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

వైసీపీ అభ్యర్థి నామినేషన్ ను అడ్డుకున్న అచ్చెన్నాయుడు.. ఉద్రిక్తత!

పంచాయతీ ఎన్నికల నామినేషన్ కు చివరి రోజు కావడంతో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేత అచ్చెన్నాయుడు అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే అచ్చెన్నాయుడు సోదరుడి కుమారుడైన తన సొంత గ్రామమైన నిమ్మాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేయడం జీర్ణించుకుకోలేకపోయారు.

దీంతో అచ్చెన్నాయుడు దానిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి. నిమ్మాడలో తనకు గౌరవం లేదని, టీడీపీ కారణంగానే తన భార్య ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చిందని అప్పన్న ఆవేదన వ్యక్తం చేసాడు. ఏది ఏమైనా వైఎస్సాఆర్సీపీ నుంచి నామినేషన్ వేసి తీరుతామన్నారు. అలా కాదంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. ఇకపై నిమ్మాడలో తనకు గౌరవం ఇస్తామన్నారు. సర్పంచ్ పదవీ ఏమీ రాష్ట్రపతి పదవి కాదంటూ ఎద్దేవా చేసారు.

ముందుగా అప్పన్నకు ఫోన్ చేసి బెదిరంపులకు పాల్పడ్డారు. అయినప్పటికీ వినకపోవడంతో అచ్చెన్న అనుచరులు అప్పన్న ఇంటికి వెళ్లి బెదిరించారు. నామినేషన్ కేంద్రానికి వచ్చిన అప్పన్నను టీడీపీ కార్యకర్తలు, అచ్చెన్నాయుడు అనుచరులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

Related News