మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. శనివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ఉప్పెన సినిమా టీమ్ ను చిరంజీవి అభినందనలు తెలిపారు. కాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతిపై మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ సేతుపతి ఫాలోయింగ్ చూసి షాకయ్యానన్నారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘మాస్టర్’ సినిమాలో హీరో పాత్రకన్నా విలన్ పాత్రే నచ్చుతుందంటూ చిరు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
కాగా ఉప్పెన షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తూ.. జార్జియాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో మేము ఉన్న హోటల్ చుట్టూ భారీగా ఫ్యాన్స్ వచ్చి చేరారు. దీంతో బయటకు వెళ్లి చూసేసరికి వారంతా విజయ్ సేతుపతి పేరుతో నినాదాలు చేస్తున్నారు. నేనింకా నా ఫాన్స్ అనుకునన్నా కాదని తెలిసి రిలీఫ్ ఫీలయ్యాను. అదే సమయంలో పక్క దేశంలో ఈ హీరోకి ఉన్న క్రేజ్ చూసి షాకయ్యను. ఈ సినిమాకు విజయ్ ఒకే చెప్పినప్పుడే సినిమా మొదటి విజయాన్ని అందుకుందన్నారు. ఉప్పెన సినిమా ప్రేమికుల దినోత్సవం స్పెషల్ గా ఫిబ్రవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.