logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సీఎం జగన్ తో ముగిసిన సినీ పెద్దల భేటీ.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. కాగా నేడు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న ఇబ్బందులు, లాక్ డౌన్ కారణంగా కార్మికులకు ఎదురవుతున్న కష్ట నష్టాలను సీఎం కు వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఏపీలో సినిమా షూటింగులకు అనుమతిచ్చారు. అందుకు సంబందించిన విషయాలను ఏపీ మంత్రి పేర్ని నానితో కలిసి సమన్వయించుకోవచ్చని తెలిపారు. దేంతో సినిమాలు పోస్టు ప్రొడక్షన్ పనులు, అర్థాంతరంగా నిలిచిపోయిన సీరియల్ షూటింగులను తిరిగి ప్రారంభించడానికి సినీ పరిశ్రమ సిద్దమవుతుంది.

అయితే భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ షరతులను పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం తెలిపినట్టుగా మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశం ద్వారా తెలిపారు. తెలంగాణలో జూన్ 15 వ తేదీ నుండి షూటింగులకు అనుమతి లభించిందని, ఏపీలో కూడా అదే రోజు నుండి ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

అయితే గత సంవత్సర కాలంగా ఈ విషయమై సీఎం జగన్ ను కలవాలన్న తన కోరిక నేడు నెరవేరిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ హామీ ఇచ్చారన్నారు. విశాఖలో దివంగత ముఖ్యమంత్రి కేటాయించిన 300 ఎకరాల స్థలాన్ని పునరుద్ధరిస్తామని, సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని జగన్ తెలిపారని చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు.

Related News