logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!

కొంత కాలంగా చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు జనసేన పార్టీ నిర్వహించిన క్రియాశీలక సమావేశంలో నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. త్వరలోనే పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి నడవబోతున్నారని చెప్పారు.

రాజకీయాల్లో తమ్ముడికి అండగా ఉంటానని చిరంజీవి స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా ఆయన పేర్కొన్నారు. పవన్ కు చిరంజీవి నైతిక మద్దతు ఉంటుందని అన్నారు. అయితే నాదెండ్ల చేసిన ఈ వ్యాఖ్యలతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోసారి చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే చర్చ ఊపందుకుంది. కాగా గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

రాజ్య సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా అయన పని చేసారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కాగా ఇప్పుడు తన సోదరుడు నెలకొల్పిన జనసేన పార్టీతో కలిసి నడుస్తున్నారని వార్త మెగా అభిమానుల్లో సంతోషం నింపుతుంది. ఇప్పటికే నాగబాబు జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసందే.

 

Related News