logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

చైనా నా మజాకా.. భారత్ సహా 20 దేశాలకు వింత కండిషన్!

చైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే భారతీయులకు ఇప్పుడది అంత సులభం కాకపోవచ్చు. అందుకు కారణం డ్రాగన్ దేశం విధించిన కొత్త నిబంధనే. చైనా దేశానికి సంబందించిన వాక్సిన్ వేసుకున్న వారికే ఇకపై ఆ దేశంలోకి ఎంట్రీ కల్పిస్తుందట. ఈ మేరకు భారత్ తో సహా 20 దేశాలకు షరతు విధించింది. ఈ మేరకు న్యూ ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ ఓ ప్రకటననను విడుదల చేసింది.

ఇందులో తెలిపిన వివరాల ప్రకారం.. విద్య, వ్యాపారం, ఉద్యోగం, బంధువులను కలుసుకోవడం లాంటి కారణాలతో ఇతర దేశస్థులకు చైనా అవకాశం కల్పిస్తుంది. అయితే వీరంతా తప్పనిసరిగా చైనా తయారుచేసిన కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలి. అంతేకాదు ఆ దేశంలోకి వెళ్లిన తర్వాత మూడు వారాల పాటు క్వారెంటైన్ లో ఉండాలి. వారికే వీసాలు జారీ చేయనుంది. మన దేశానికి చెందిన దాదాపు 20 వేల మంది విద్యార్థులు చైనాలో విద్యనభ్యసిస్తున్నారు.

కరోనా కారణంగా వారంతా స్వదేశానికి తిరిగి వచ్చేసారు. అయితే ఇప్పుడు నిబంధనలు సడలించడంతో తిరిగి చైనాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా తాజా ప్రకటనతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మన దేశంలో చైనా తయారు చేసిన టీకాలకు అనుమతులు లేకపోవడమే. చైనా టీకాలపై సరైన పారదర్శకత లేని కారణంగా భారత్ సహా కొన్ని దేశాలు ఆ టీకాలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో చైనా కొత్త ఎత్తుగడకు తెర తీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News