logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

చేపల్లోనూ కరోనా వైరస్.. భారత్ దిగుమతుల్ని నిలిపివేసిన చైనా

కరోనా వైరస్ విస్తరించని చోటు లేకుండా పోతుంది. ఆహార పదార్థాల్లోనూ ఈ వైరస్ జాడలు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చైనాలో బయటపడేవి. కానీ ఈసారి ఆశ్చర్యంగా భారత్ నుంచి పంపిన మాంసం ఉత్పత్తుల్లో వైరాస్ ను గుర్తించడంతో చైనా ఉలిక్కిపడింది.

భారత్ కు చెందిన బసు ఇంటర్ నేషనల్ కంపెనీ నుంచి చైనా చేపలను దిగుమతి చేసుకుంటుంది. గతంలో ఇండోనేషియాకు చెందిన పీటీ అనురాగ్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కూడా కరోనా బయటపడటంతో ముందు జాగ్రత్తగా చైనా అధికారులు భారత్ దిగుమతులపై కూడా దృష్టి పెట్టారు.

మన దగ్గర నుంచి వెళ్లిన పదార్థాలను పరీక్షించగా ఊహించని విధంగా గడ్డకట్టించిన కటిల్‌ఫిష్‌ ప్యాకేజీలోని మూడు శాంపిళ్లలోని పదార్థాలలో కరోనా వైరస్ ను గుర్తించారు. దీంతో వెంటనే ఇండియా దిగుమతులపై చైనా నిషేధం విధించినట్టుగా రాయిటర్స్ తన కథనంలో ప్రచురించింది.

అయితే ఇతర దేశాల నుంచి చైనాకు వెళ్లే ఆహార పదార్థాలలో మాత్రమే కరోనా వెలుగుచూస్తుండటం విశేషం. గతంలో బ్రెజిల్‌, ఈక్వెడార్‌, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల్లోనూ ఇలాగే జరిగింది. ఆ తర్వాత ఈక్వెడార్ నుంచి చైనాకు వెళ్లిన రొయ్యలు, బ్రెజిల్ నుంచి వెళ్లిన చికెన్ లోనూ కరోనా ఉందని కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

Related News