logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ప్రపంచ దేశాలకు షాక్.. కరోనా వాక్సిన్ పై చైనా సీక్రెట్ ఆపరేషన్

చైనా అంటించిన కరోనా వైరస్ నుంచి బయటపడలేక ప్రపంచం పోరాటం చేస్తుంది. కానీ చైనా మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కరోనా వాక్సిన్ ను సృష్టించడమే కాదు ఇప్పటికే చాలా మందికి వాక్సిన్ వేసేసిందట. సైనోవాక్ కంపెనీ తయారుచేసిన ‘కరోనావాక్’ అనే వాక్సిన్ కు చైనా ప్రభుత్వం జులై నెలలోనే అనుమతిచ్చిందని సమాచారం. కరోనాపై వాక్సిన్ తయారుచేస్తున్న జాబితాలో చైనా కూడా ముందంజలో ఉంది.

అయితే ఇప్పుడు అక్కడ ప్రయోగిస్తున్న కరోనావాక్ చైనా కనిపెట్టిన వాక్సిన్లలో మూడవదని కరోనా పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. కరోనా సోకి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి, అక్కడి వైద్య సిబ్బందికి ఇప్పటికే ఈ వాక్సిన్ ను ఇచ్చేస్తున్నారట. దీనిపై అంతర్జాతీయంగా కూడా వార్తలు వస్తున్నాయి. కరోనాపై ఇతర దేశాలు తయారుచేస్తున్న వాక్సిన్ లన్ని ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న విషయం తెలిసిందే.

కరోనాను ప్రపంచ దేశాలకు అంటించిన చైనా ఈ వాక్సిన్ ను సీక్రెట్ గా ప్రయోగిస్తుండటం గమనార్హం. ఈ వాక్సిన్ పై చైనా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ కూడా ఇది నిజమేనని తెలిపింది. ప్రపంచ దేశాలకు ఈ వార్త షాకిచ్చింది.

Related News