logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

చైనా అధ్యక్షుడికి నిద్ర లేకుండా చేస్తున్న ఆ బొమ్మ..! ఆ ఫొటోలో ఏముంది?

చైనా – అమెరికా దేశాలు ఇప్పటికే కరోనా కారణంగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇటీవల సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి యుద్ధ నౌకలను తరలించిన షాకిచ్చింది. దీనిపై కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనా తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మైక్ పాంపియో చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్ ఇప్పుడు అగ్గిరాజేస్తుంది.

ఈ వివాదానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. మైక్ తన సోషల్ మీడియా ఖాతాలో తమ పెంపుడు కుక్క కొన్ని బొమ్మలతో ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేసారు. అందులో ఒక బొమ్మ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మైక్ కావాలనే చైనా అధ్యక్షుడిపై వ్యంగంగా ఈ బొమ్మను పోస్ట్ చేసాడని చర్చ మొదలైంది. ఆ బొమ్మ పేరు విన్నీ ద పూ. తేనె అంటే పడి చచ్చే ఓ ఎలుగు బంటి పాత్ర. అమాయకత్వానికి మారు పేరు. కానీ ఈ పేరు వింటే చైనా మాత్రం మండిపడుతోంది. ఈ కార్టూన్ గత కొన్నేళ్లుగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రపంచం మొత్తం అభిమానించే ఈ బొమ్మ చైనాలో మాత్రం ఎంత వెతికినా కనిపించదు.

మరి ఈ బొమ్మ జిన్ పింగ్ ను ఎందుకింత భయపెడుతుంది అనే విషయానికొస్తే.. కమ్యూనిస్టు ప్రభుత్వమైన చైనా నచ్చకుంటే దేన్నైనా నిషేధించగలదు. అందులో ప్రభుత్వ తీరును వ్యతిరేకించారన్న కారణంతో వ్యక్తులను దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ మాటకొస్తే చైనాలో ‘N’ అనే అక్షరం వాడటం కూడా నిషేధమే. ఆ దేశంలో అధ్యక్షులను అపహాస్యం చేయడం, దూషించడం శిక్షార్హం. అందువల్ల కొందరు ఆకతాయి నెటిజన్లు తమ అధ్యక్షుడికి కొన్ని మారు పేర్లు పెట్టి పిలుచుకుంటారు. అలాగే 2013 లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శరీరాకృతిని ఎలుగుబంటి పాత్ర అయిన విన్నీతో పోలుస్తూ ఓ కార్టూన్ వెలువడింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కార్టూన్ బాగా ఫెమస్ అయింది.

అక్కడితో ఆగకుండా తమ క్రియేటివిటీకి పని చెప్పిన చైనీయులు ఇలాంటి కార్టూన్లు మరిన్ని రూపొందించారు. అప్పటి నుంచి ఈ కార్టూన్ బొమ్మలో తమ అధ్యక్షుడిని చూసుకోవడం మొదలుపెట్టారు. చైనీయులు తమ అధ్యక్షుడిపై సరదాకి రూపొందించిన ఈ కార్టూన్లు ఇతర దేశాలకు కూడా చేరడంతో వారు కూడా వీటిని వైరల్ చేసారు. ఆ తర్వాత విన్నీ బొమ్మను జిన్ పింగ్ కు చిహ్నంగా గుర్తించడం మొదలుపెట్టారు. వివిధ దేశాల అధ్యక్షులు చైనాలో పర్యటించిన సమయంలో ఈ కార్టూన్ తో మీమ్స్ చేయడం వాటిని వైరల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, జపాన్ అధ్యక్షుడు షింజో ఏప్ తో జింగ్ పింగ్ పై రూపొందించిన మీమ్స్ అచ్చుగుద్దినట్టుగా ఉండటంతో చైనీయులు కూడా నోరెళ్లబెట్టారు. ఇది చైనా అధ్యక్షుడిని విపరీతంగా ఇబ్బంది పెట్టింది. ఆయనలో తెలియని అభద్రతా భావం ఏర్పడింది.

దీంతో ఈ కార్టూన్ ను చైనాలో నిషేదించాలని ప్రయత్నాలు కూడా చేసారు. కానీ పిల్లలు ఆడుకునే బొమ్మ కావడంతో అది సాధ్యపడలేదు. అందుకు ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు మాత్రం చేసారు. చైనా టీవీ సెట్లలో వీనికి సంబందించిన కార్యక్రమాలు ప్రసారం కాకుండా చేసారు. ఇంటర్ నెట్ లో కూడా ఈ బొమ్మ పేరును సెర్చ్ చేస్తే ప్రభుత్వం ఆమోదించిన కొన్ని లింకులు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ఎక్కువ వెతికితే మీకు అనుమతి లేదంటూ ఓ డిస్క్లైమర్ కనిపిస్తుంది. చైనా అధ్యక్షుడు పర్యటనకు వచ్చిన సమయంలో ఈ విన్నీ బొమ్మను అధ్యక్షుడు జిన్ పింగ్ కంట పడకుండా జాగ్రత్త వహిస్తాయి మిత్ర దేశాలు. విన్నీ పేరుతో వచ్చిన ఒక వీడియో గేమ్ లో ఈ బొమ్మని జిన్‌ పింగ్ తో పోల్చినట్టు కొన్ని విషయాలు వుండడంతో 2019లో ఆ గేమ్ ను ప్లే స్టోర్ లో నుండి తొలగించారు. కానీ ఇప్పుడు మైక్ పంపియో చేసిన పోస్ట్ తో మళ్ళీ దీనిపై చర్చ మొదలైంది. అమెరికన్లు ఈ ఫోటోను తెగ వైరల్ చేసేస్తున్నారు. కానీ ఈ దాడిని తిప్పి కొట్టేందుకు చైనీయులకు అవకాశం లేదు. ఎందుకంటే చైనాలో ట్విట్టర్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ తమ అధ్యక్షుడిని అపహాస్యం చేసిన మైక్ పాంపియోకు వారు తొందర్లోనే సమాధానం ఇస్తారని అంటున్నారు.

Related News