logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

క‌రోనా వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పిన చైనా

క‌రోనా వైర‌స్ పుట్టిన చైనా వ్యాక్సిన్ త‌యారీలో ముంద‌డుగు వేసింది. తాము అభివృద్ధి చేస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను ఈ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నాటికే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని చైనా సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్ష‌న్‌(సీడీసీ) వెల్ల‌డించింది. త‌మ దేశంలో ప్ర‌స్తుతం నాలుగు క‌రోనా వ్యాక్సిన్‌లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు ఈ సంస్థ తెలిపింది.

ప్ర‌స్తుతం మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయ‌ని, ఇవి కూడా విజ‌య‌వంత‌మైతే న‌వంబ‌ర్ నాటికే సాధార‌ణ ప్ర‌జ‌ల వినియోగానికి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంతేకాదు, ఇప్ప‌టికే త‌మ దేశంలో త‌యారై నాలుగు వ్యాక్సిన్‌ల‌లో మూడు వ్యాక్సిన్‌ల‌ను క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు అందించిన‌ట్లు కూడా ప్ర‌క‌టించింది. ఏప్రిల్‌లోనే ఈ వ్యాక్సిన్‌ల ప్ర‌యోగాలు ప్రారంభ‌మైన‌ట్లు తెలిపింది.

చైనా ప్ర‌భుత్వానికి చెందిన చైనా న‌ష‌న‌ల్ ఫార్మాస్యూటిక‌ల్ గ్రూప్‌(సినోఫార్మ్‌) త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని, ఈ వ్యాక్సిన్‌కు జూన్‌లోనే అత్య‌వ‌స‌ర వినియోగానికి ప్ర‌భుత్వం అనుమ‌తించింది. త్వర‌లోనే ఈ వ్యాక్సిన్‌ను చైనా సైన్యానికి కూడా అందించ‌నున్నారు. మొత్తంగా క‌రోనా వైర‌స్ త‌యారీ, వినియోగంలో చైనా ముందున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Related News