logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

గాల్వాన్ ఘర్షణల్లో చైనా వైపు ఒక్కరే మరణించారట..!

గాల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికులపై ఎట్ట్టకేలకు చైనా నోరు విప్పింది. అయితే తమ దేశానికి చెందిన ఒక సైనిక అధికారి మాత్రమే చనిపోయాడని చైనా వ్యాఖ్యానించడం గమనార్హం. సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు అమరులయ్యారు. అయితే ఎప్పటిలాగే చైనా మాత్రం తమ సైనికుల మారణాలను దాచే ప్రయత్నం చేసింది.

తాజాగా ఇండియన్ ఆర్మీతో జరిగిన చర్చల్లో భాగంగా చైనా ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. కానీ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా చైనా వైపు వచ్చిన అంబులెన్స్‌లు, హెలికాప్టర్లు, చైనీయుల సంభాషణ ఆధారంగా చైనాకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరణించిన వారి సంఖ్య దాదాపు 40 మందికి పైగానే ఉంటుందని తెలిపారు.

చైనా తమ సైనికులు మరణించాడని అవమానంగా భావిస్తుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఘర్షణల్లో మరణించిన జవాన్ల సంఖ్య బహిర్గతం చేయాలని చైనీయులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారట. కాగా ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 70 మంది భారత జవాన్లు మరో వారంలో తిరిగి విధుల్లో చేరతారని భారత ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది.

Related News