logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

గాల్వన్ ఘటనపై మాట మార్చిన చైనా.. ఆ ఒత్తిడే కారణమా?

భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా చైనా స్పందించింది. గాల్వన్ ఘటన దురదృష్టకరమైనదిగా చైనా భావిస్తుందని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఘటనలను తాము కోరుకోవడం లేదని భారత్ లోని చైనా రాయబార కార్యాలయం అధికారి సన్ విడాన్గ్ అన్నారు.

అంతేకాదు చైనా భారత్ తో శత్రుత్వం పెంచుకోవాలని అనుకోవడం లేదని.. భారత్ ను మిత్ర దేశంగానే భావిస్తుందని అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్- చైనా పరస్పర సహకారం అందించుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్యనున్న వివాదాలను సైతం పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

కాగా గాల్వాన్ ఘటన జరిగిన సమయంలో చైనా స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. గాల్వన్ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్న సమయంలో ఈ ఘటనపై సంతాపం ప్రకటించడం గమనార్హం. కాగా ఈ ఘటన తర్వాత భారత్ స్వదేశీ నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. చైనాపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఇటీవల ప్రధాని మోదీ కూడా స్వదేశీ ఉతపత్తులనే వాడదామంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక భారత్ లో టిక్ టాక్ ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చైనా భారీగానే నష్టపోయింది. ఒక విధంగా చైనాపై ఇది ఒత్తిడి తీసుకువచ్చే అంశమే. ఈ విషయాలన్నీ వీడాన్గ్ పరోక్షంగా ప్రస్తావించారు. ఏ దేశమైనా ఒంటరిగా అభివృద్ధి సాధించలేదని.. స్వయం సమృద్ధి సాధిస్తూనే ఇతరులకు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్ళ ధృడమైన బంధం ఉందని చెబుతూ.. త్వరలోనే రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

Related News