logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

అల్లు అర్జున్ చిన్ననాటి జోడీ హీరోయిన్ కాబోతుంది..!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా నటించిన ఈ తెలుగమ్మాయి గుర్తుందా? అదేనండీ ‘గంగోత్రి’ సినిమాలో చిన్ననాటి అల్లు అర్జున్ పాత్రకు జోడీగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్. కావ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ వల్లంకి పిట్ట పాటను గుర్తు చేస్తే టక్కున గుర్తు పడతారు. మూడేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న ఈ తెలుగమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీకి సిద్ధమవుతుంది.

ఈరోజు కావ్య పుట్టిన రోజు. ఆమె ఇటీవల తీసుకున్న ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. గంగోత్రితో పాటుగా బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ సినిమాలలో కనిపించింది. అయితే బాల నటిగా మొత్తం 13 సినిమాలలో కనిపించానని నటినవ్వాలని చిన్నప్పటి నుంచే కోరిక ఉందని కావ్య చెప్పుకొచ్చింది. తాను తెలుగమ్మాయిని కావడమే తనకు మెయిన్ అడ్వాంటేజ్ గా భావిస్తున్నానని తెలిపింది. ఇతర బాషల నుంచి వచ్చే వారు తెలుగు వారి భావోద్వేగాలను సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇక్కడి నేటివిటీ, కల్చర్ తెలుగమ్మాయిలా చక్కగా అర్థం చేసుకోగలరు.

అయితే ఒక వేళ నటిగా రాణించలేకపోతే చదువును నిర్లక్ష్యం చేశాననే భావన ఉండకూడదనే ఉదేశ్యంతో లా పూర్తి చేశాను. ఇప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం ఆడిషన్స్ ఇస్తున్నాను. అయితే లాక్ డౌన్ కారణంగా నేను నటిస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ మెంట్ క్యాన్సిల్ అయ్యాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాను. మంచి కథాంశంతో ఎవరైనా సంప్రదిస్తే ఓటీటీ వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా సిద్ధమేనని కావ్య తెలిపింది.

Related News