logo

  BREAKING NEWS

బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |  

‘బర్డ్ ఫ్లూ’ అలెర్ట్: చికెన్, గుడ్లు తినవచ్చా?

రాజస్తాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో కొత్తగా బర్డ్ ఫ్లూ అలజడి సృష్టిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పక్షులు ఈ వైరస్ సోకి మృత్యువాత పడ్డాయి. ఈ వైరస్ ధాటికి పౌల్ట్రీ పరిశ్రమ వణికిపోతుంది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్, గుడ్డు పేరు చెబితేనే ప్రజలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. దీంతో చికెన్ రేట్లు భారీగా పతనమయ్యాయి. కేరళ రాష్ట్రంలో వేల సంఖ్యలో కోళ్లను యజమానులు పాతిపెడుతున్నారు. బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న కారణంగా తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా కోళ్ల ఫారం యజమానులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూకి చికెన్ కు మధ్య ఏమిటి సంబంధం? ఇలాంటి పరిస్థితుల్లో చికెన్, గుడ్లు తినడం మంచిదేనా? అనే సందేహాలు అందరిలో తలెత్తుతున్నాయి. అయితే ఈ సందేహాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని విషయాలను వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బర్డ్ ఫ్లూనే ఏవియన్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఇది హెచ్5ఎన్1 అనే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మొదటగా 1997 లో మనుషుల్లో దీనిని గుర్తించారు, గతంలో ఈ వైరస్ సోకిన వారిలో సుమారుగా అరవై శాతం మంది మరణించారు. ఈ వ్యాధికి సంబందించిన వైరస్ పక్షుల పేగుల్లో ఉంటుంది. అందువల్ల వాటి ద్వారా ఇతర పక్షులకు కూడా చాలా తొందరగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన పక్షులను పట్టుకున్నా, వాటి మాంసాన్ని తాకినా, సరిగా ఉడికించని మాంసాన్ని తిన్నా మనుషులకు కూడా ఈ వైరస్ సోకె ప్రమాదం ఉంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకె అవకాశాలు చాలా తక్కువ.

లక్షణాలు:
బ‌ర్డ్ ఫ్లూ సోకితే దగ్గు, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, ముక్కు కారడం, గొంతు నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏవియన్ వైరస్ ఉన్న పరిసరాలను సందర్శించిన వారికి పది రోజులలోపు ఈ లక్షణాలు ఉంటె వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆసుపత్రికి వెళ్లే ముందు లక్షణాలు ఉన్న విషయాన్ని ముందుగానే ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించడం ద్వారా వారు సరైన జాగ్రత్తలు తీసుకుంటారు.

వైరస్ సోకె రిస్క్ ఉన్న వారు ఎవరంటే?
పౌల్ట్రీ ఫార్మర్, ఈ ఇంఫెక్షన్ ఉన్న ప్రదేశానికి సందర్శించిన వారు, ఇన్ఫెక్ట్ అయిన పక్షులకు దగ్గరగా ఉన్నవారు, సరిగా ఉడికించని పౌల్ట్రీ, ఎగ్స్ తిన్న వారు, ఈ ఇంఫెక్షన్ సోకిన వారికి వైద్యం అందించిన హెల్త్ కేర్ వర్కర్, ఇన్ఫెక్షన్ సోకిన వారి కుటుంబం లోని వ్యక్తులకు బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే ఇది మన శరీరంలోని అవయవాలను డ్యామేజ్ చేయగలదు, న్యుమోనియా, శ్వాసకు సంబందించిన సమస్యలను కలిగించి ప్రాణాపాయానికి గురి చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
డబ్ల్యూహెచ్వో తెలిపిన వివరాల ప్రకారం పక్షులను దగ్గరకు తీసుకున్నా, వాటి మాంసాన్ని ఉడికించకుండా తిన్నా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కానీ బాగా ఉడికిచ్చిన మాంసాన్ని, గుడ్లను తినడం వలన ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేసింది. అధిక ఉష్ణోగ్రతలను బర్డ్ ఫ్లూ కు కారణమయ్యే వైరస్ తట్టుకోలేదు. అందువల్ల మాంసాన్ని 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినాలి. సగం ఉడికించిన మాంసాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఈ వైరస్ ముఖ్యంగా అటవీ పక్షులు, విదేశీ పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. అందువల్ల మాంసాన్ని ఉడికించి తినడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుంది.

Related News