logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొరడా దెబ్బలు.. ఇంతకీ ఏం చేసారంటే?

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీపావళి నాడు ఆయన కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది. అంత తప్పు ఆయనేం చేశారు? చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రిని శిక్షించే ధైర్యం ఎవరికుంటుందీ అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ దీపావళి సందర్భంగా తన రాష్ట్రంలోని దుర్గ్ జిల్లా, జజంగిరి గ్రామానికి వచ్చారు. ప్రతి ఏటా దీపావళి రోజు ఇక్కడ నిర్వహించే గోవర్ధన పూజ ఎంతో ప్రత్యేకం. పండుగ నాడు జరిగే గోవర్ధన పూజలో పాల్గొనే వారు కొరడా దెబ్బలు తింటే శుభం కలుగుతుందనే ఆచారం ఇక్కడ ఉంది. దీంతో ఆ పూజలో పాల్గొనేవారంతా చేతిపై కొరడా దెబ్బలు కొట్టించుకుంటారు.

ముఖ్యమంత్రి కూడా తాను ఈ ఆచారాన్ని పాటిస్తానంటూ ముందుకొచ్చారు. తమ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేతిపై పలుమార్లు కొరడా దెబ్బలు కొట్టించుకుని ప్రజలంతా క్షేమంగా ఉండాలని పూజలు నిర్వహించారు.

Related News