logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రేప్ కేసు పెట్టి యువకుడిని వేధించిన యువతికి షాక్: కోర్టు సంచలన తీర్పు!

తప్పుడు రేప్ కేసు పెట్టి యువకుడిని వేధించడమే కాకుండా జైలు శిక్ష అనుభవించేలా చేసిన యువతికి కోర్టు షాకిచ్చింది. తమ కూతురిని సంతోష్ అనే యువకుడు రేప్ చేసాడని అమ్మాయి కుటుంబం అతనిపై కేసు పెట్టింది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను కాదని ఎంత చెప్తున్నా పోలీసులతో సహా ఎవ్వరూ వినిపించుకోలేదు. దీంతో ఆ యువకుడు చెన్నై కోర్టును ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో కోర్టు సంచలనం తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నై కి చెందిన సంతోష్ అనే యువకుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వారి ఇంటి పక్కనే మరో కుటుంబం నివసించేది. రెండు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా మెలిగేవి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం వారు కావడంతో సంతోష్ కు వారి కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. దీంతో ఇద్దరూ పెళ్లికి ముందు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తీరా పెట్టుపోతల విషయంలో రెండు కుటుంబాలకు మధ్య మనస్పర్థలు వచ్చాయి.

పెళ్లి సంబంధం కూడా వద్దనుకున్నారు. ఆ తర్వాత సంతోష్ కుటుంబం అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇంతలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తమ కూతురు గర్భం దాల్చిందని, ఆ గర్భానికి కారణం సంతోష్ అంటూ అమ్మాయి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు సంతోష్ పై రేప్ కేసు పెట్టారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఏర్పడలేదని ఆ బిడ్డకు తండ్రిని నేను కాదని చెప్పినా వినిపించుకోకుండా 2009 నవంబరులో సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేసి 95 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.

ఆ తరువాత 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటికే తనపై కేసు పెట్టిన యువతికి నెలలు నిండి ఒక పాపకు జన్మనిచ్చింది. ఏళ్ళు గడుస్తున్నా తనకు జరిగిన అన్యాయం అతన్ని వేధిస్తుంది. దీంతో ఆరేళ్ళ తర్వాత 2016 లో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నిజం తేల్చాలని కోరాడు. ఆ పరీక్షల్లో ఆ పాపకు సంతోష్ కు మధ్యన ఎలాంటి జన్యు సంబంధం లేదని నిర్దారణ అయ్యింది. అయినా సంతోష్ కు న్యాయం జరగలేదు.

కోర్టులో కేసు నడుస్తూనే వచ్చింది. చివరకు 2016 ఫిబ్రవరి 10న చెన్నై మహిళా కోర్టు సంతోష్ ను ఈ కేసులో నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ యువతి, ఆమె కుటుంబం కారణంగా తనకు సమాజంలో పరువు పోగొట్టుకున్నానని అందరూ నన్ను చీదరించుకున్నారని, హేళన చేశారని తనను తనకుటుంబాన్ని ఇంత మానసిక క్షోభకు గురి చేసిన యువతికి సరైన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. వారి కుటుంబంపై రూ. 30 లక్షలకు పరువు నష్టం దావా వేసాడు. చివరకు కోర్టు అమ్మాయి కుటుంబాన్ని రూ. 15 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో బాధిత యువకుడికి పూర్తి న్యాయం జరిగినట్టేనా అనేది ప్రశ్నగానే మిగిలింది.

Related News