logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ప్రముఖ సినీ నటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్..!

ప్రముఖ సినీ నటుడు శ్యామ్ అరెస్ట్ సినీ వర్గాల్లో కలకలం రేపింది. గత రాత్రి చెన్నై పోలీసులు శ్యామ్ ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ ను శ్యామ్ నిర్వహిస్తున్నాడు. క్లబ్ పేరుతో శ్యామ్ ఇందులో గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. అనుమతులు లేకుండా ఈ క్లబ్బులో పేకాట, బెట్టింగులకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో శ్యామ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళ నటుడైన శ్యామ్ తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు. రవి తేజ కిక్ సినిమాలో శ్యామ్ నటించడంతో తెలుగులో బిజీ నటుడిగా మారిపోయాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాల్లో శ్యామ్ ఎక్కువగా కనిపిస్తాడు. అలాగే అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ సోదరుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

శ్యామ్ పూర్తి పేరు మొహమ్మద్ షమ్‌షుద్దీన్ ఇబ్రహీం. మొదట మోడలింగ్ రంగంలో పని చేసిన శ్యామ్ ఆ తర్వాత 2001 నుంచి సినిమాలో నటించడం ప్రారంభించాడు. కాగా అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Related News