logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఇల్లరికపు అల్లుడి ఘాతుకం: భార్యపై కోపంతో ఎవ్వరూ చేయని పని..

పేరుకే వైద్యుడు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత పాశవికంగా హత్య చేసాడు. అడ్డొచ్చిన మామను కత్తితో పొడిచాడు. భార్యను గొంతు కోసి అప్పటికీ కసి తీరక ఆమెను లాక్కొచ్చి కారుపై నుంచి కారును పోనిచ్చాడు. ఇంతలా అమానుషానికి పాల్పడటాని ఇంతకీ ఆ భార్య చేసింది అంటే భర్త వైఖరి నచ్చక విడాకులు అడిగింది.

ఆ కారణంతో ఏ భర్తా చేయనంత దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే… కోయంబత్తూరుకు చెందిన గోకుల్ కుమార్ (40) వృత్తిరీత్యా వైద్యుడు. మరో వైద్యురాలైన కీర్తనను ప్రేమ వివాహ చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత కీర్తన ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అయితే కొంత కాలంగా వీరిద్దరూ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త వైఖరితో విసుగెత్తిపోయిన కీర్తన తనకు విడాకులు కావాలని కోరింది.

ఇదే విషయంలో కీర్తన తండ్రి కూడా గోకుల్ తో గొడవపడ్డాడు. దీంతో తనకు అత్తవారింట్లో మర్యాద పోయిందని తన భార్యే తనను వద్దనుకుంటుందని అలాంటి భార్య ప్రాణాలతో ఉండకూడదని భావించాడు. నేరుగా భార్య ఇంటికివెళ్ళాడు. అడ్డొచ్చిన మామను కత్తితో పొడిచాడు.

భార్య కీర్తనను కూడా అదే కత్తితో గొంతు కోశాడు. ఆ తర్వాత బయటకు లాక్కుంటూ తీసుకువచ్చి రోడ్డుపై పడేసాడు. తన కారును ఆమె కడుపు పైనుంచి పోనిచ్చి కసి తీరా హత్య చేసాడు. అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నంలో గోకుల్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడు

Related News