‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ స్పీడు పెంచాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా లావణ్య త్రిపాఠి- కార్తికేయ నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్ళపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విభిన్నమైన కథాంశంతో రానున్న ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా తెరకెక్కుతుంది.
టైటిల్ తోనే ఆకట్టుకున్న కారికేయ.. ‘బస్తీ బాలరాజు’గా తన ఫస్ట్ లుక్ తో అదరగొట్టాడు. తాజాగా సినిమాకు సంబందించిన టీజర్ ను విడుదల చేసారు సినిమా టీమ్. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం విడుదలైన సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్లకు మధ్యన వచ్చే సంభాషణలు యూత్ ను ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అలరిస్తుంది. బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.