logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ..!

హీరో కార్తికేయ బస్తీ బాలరాజుగా మారి ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి నటించింది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటివరకు నటించని పాత్రలో కార్తికేయ కనిపిస్తున్నాడు. ఈ వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా కార్తికేయకు ఎలాంటి ఫలితాన్ని అందించిందో రివ్యూలో చూద్దాం…

కథ:
హీరో కార్తికేయ బస్తీ బాలరాజుగా కనిపిస్తాడు. శవాలకు దహన సంస్కారాలు చేస్తుంటాడు. అలా ఓ రోజు పీటర్ అనే వ్యక్తి శవాన్ని మోస్తూ అతని భార్య మల్లిక(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడతాడు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ ప్రేమించమని ఆమెను టీజ్ చేస్తుంటాడు. బాలరాజు తీరుతో విసిగిపోయిన మల్లిక అతనిపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. ఆ తర్వాత కథలో పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. బాలరాజు తల్లి ఆమని పాత్ర కథలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడే బాలరాజుకు సంబందించిన ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. అసలు బస్తీ బాలరాజు ఎవరు? అతని తల్లి గతమేంటి? అప్పటికే పెళ్ళై భర్తను కోల్పోయిన మల్లిక బాలరాజు ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా? అనే విషయాలు తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
చావు కబురు చల్లగా సినిమా స్టోరీ లైన్ కాస్త భిన్నంగా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగిపోతుంది. ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. కార్తికేయ ఈ సినిమా ద్వారా మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంటాడు. కార్తికేయ యాక్టింగ్ సినిమాకు మేజర్ ప్లస్ గా మారింది. అలాగే డీ గ్లామరస్ లుక్ లో లావణ్య త్రిపాఠి ఆకట్టుకుంటుంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అలరిస్తుంది. సినిమాలో డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.

అయితే సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ కనిపించదు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కథలో మంచి విషయం ఉన్నా స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ వహిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించినా సెకండ్ హాఫ్ లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఏదీ సరిగ్గా వర్కవుట్ అవ్వలేదు. సినిమాపై ఆ ఎఫెక్ట్ బాగానే కనిపిస్తుంది. పాత్రల మీదనే కాకుండా కథను నడపడంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ వహిస్తే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే.. కార్తికేయ నటన, లావణ్య త్రిపాఠి. ఫస్ట్ హాఫ్ కామెడీ లాంటివి సినిమాను నిలబెట్టాయి.

మైనస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. సెకండ్ హాఫ్, స్లో నరేషన్ లాంటివి సినిమాకు మైనస్ గా నిలుస్తాయి.

రేటింగ్:
చావు కబురు చల్లగా సినిమాకు ఫైనల్ గా 2.5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News