తొలి రోజే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వ్యవసాయరంగంపై మంత్రి కన్నబాబు సభ ముందు పూర్తి వివరాలు ఉంచారు. మంత్రి ప్రసంగం ముగిసిన తరువాత టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్ రామానాయుడు మాట్లాడే సమయంలో అడ్డుపడ్డారు.
సొంత పార్టీ నాయకుడు మాట్లాడుతున్న సమయంలో అడ్డుకోవడం సబబు కాదంటూ స్పీకర్ కేశవ్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. దీనిపై సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడటం మాట్లాడుతున్నారన్నారు. వారు అడిగిన అంశంపై మేము క్లారిటీ ఇచ్చాము మళ్ళీ అదే అంశంపై చర్చ జరపాలని అనడం సమంజసం కాదన్నారు.
తాము చర్చజరగాలన్న విషయం చర్చిస్తున్న సమయంలోనే టీడీపీ సభ్యులు వాకౌట్ చేయడం విశేషం. అనంతరం చంద్రబాబు పట్టరాని ఆవేశంతో ఊగిపోయారు. నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరగడంతో స్పీకర్ పోడియం ముందు కింద కూర్చుని ధర్నాకు దిగారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు అసెంబ్లీలో రౌడీయిజం చేస్తున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఓ పద్ధతి లేకుండా కర్నూలు ఎంపీని ‘ఏం పీకుతావు’ అని చంద్రబాబు అన్నారు. కళ్ళు పెద్దవి చేసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు జగన్. మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ చంద్రబాబు కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఒక రోజు పాటు చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సప్సెన్షన్ కు తీర్మానం చేసారు.