logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?

ఇప్పుడు మ‌న దేశ రాజ‌కీయాల్లో మొత్తం వ్యూహ‌క‌ర్త‌ల హ‌వా న‌డుస్తోంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌లు ఒక పార్టీతో ఒప్పందం చేసుకొని ఆ పార్టీని ఎన్నిక‌ల్లో గెలిపించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ల‌ను సెఫాల‌జిస్టులు అంటారు. మ‌న దేశంలో చాలా మంది సెఫాల‌జిస్టులు ఉన్నా ఇప్పుడు ప్ర‌శాంత్ కిషోర్ హ‌వా న‌డుస్తోంది. గ‌త‌ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌, ఇటీవ‌ల‌ అర‌వింద్ కేజ్రీవాల్ కోసం ప్ర‌శాంత్ కిషోర్ ప‌నిచేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ విజ‌యం వెనుక ప్ర‌శాంత్ కిషోర్‌ వ్యూహాలు ఎక్కువ‌గా ప‌నిచేశాయ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు భావిస్తున్నారు. వాస్త‌వానికి, ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందే ప‌సిగ‌ట్టారు. ప్ర‌శాంత్ కిషోర్‌ను నైతికంగా దెబ్బ‌కొట్టేందుకు అప్ప‌ట్లో ఆయ‌న‌పై అనేక విమ‌ర్శ‌లు చేశారు. కొన్నిసార్లు బిహార్ గ్యాంగ్ అని కూడా పీకేని ఉద్దేశించి బాబు ఆరోపించారు.

కాగా, ఇప్పుడు చంద్ర‌బాబు త‌మ పార్టీకి పీకే లాంటి ఒక వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకోవాల‌ని భావించి, రాబిన్ శ‌ర్మ అనే ఓ ప్రొఫెష‌న‌ల్‌ను రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. రాబిన్ శ‌ర్మ‌కు పెద్ద చ‌రిత్ర‌నే ఉంది. ఆయ‌న ప్ర‌శాంత్ కిషోర్‌కు ఏక‌ల‌వ్య శిష్యుడి లాంటి వారు. ఆయ‌న‌తో క‌లిసి సిటిజ‌న్స్ ఫ‌ర్ అకౌంట‌బుల్ గ‌వ‌ర్నెన్స్‌(సీఏజీ) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ‌లోనూ ఆయ‌న కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీ విజ‌యానికి బాగా ఉప‌యోగ‌ప‌డిన చాయ్ పే చ‌ర్చ కార్య‌క్ర‌మానికి ప్ర‌చార బాధ్య‌త‌లు రాబిన్ శ‌ర్మ‌నే చూశారు.ఆ ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌చారాన్ని ఆయ‌నే చూసుకున్నారు.

2015లో ఐప్యాక్ సంస్థ బిహార్‌లో నితీష్ కుమార్ కోసం ప‌నిచేసింది. అప్పుడు హ‌ర్ ఘ‌ర్ నితీష్ – హ‌ర్ మ‌న్ నితీష్ పేరుతో నిర్వ‌హించిన ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను కూడా రాబిన్ విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాహుల్ గాంధీ నిర్వ‌హించిన ఖాట్ స‌భ‌ల ప్ర‌చారాన్ని రాబిన్ శ‌ర్మ‌నే చూసుకున్నారు.త‌ర్వాత కొంత‌కాలం కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు నేతా యాప్ అనే ఓ సంస్థ‌కు సీఈఓగా ప‌నిచేశారు.

ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన రాబిన్ శ‌ర్మ రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డంలో ఆరితేరి ఉన్నారు. పీకే టీమ్‌లో కీల‌క స‌భ్యుడిగా ప‌నిచేసిన అనుభ‌వంతో ఆయ‌న ఇప్పుడు స్వంతంగా ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఇది నిజ‌మే అయితే ఇప్ప‌టికే ప్ర‌చారం చేసుకోవ‌డంలో ముందుండే టీడీపీకి అద‌న‌పు బ‌లం ల‌భించ‌నున్న‌ట్లే.

స్థానిక సంస్థల ఎన్నిక‌ల నుంచే రాబిన్ శ‌ర్మ టీమ్ తెలుగుదేశం పార్టీ కోసం ప‌ని చేయ‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టి ఈ టీమ్ స‌భ్యులు కొంద‌రు 13 జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ మూడు రాజ‌ధానుల అంశంపై ప్ర‌జ‌ల మూడ్‌ను ప‌సిగ‌ట్టే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ నివేదిక‌ను చంద్ర‌బాబుకు అందించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించ‌డ‌మే ల‌క్ష్యంగా రాబిన్ శ‌ర్మ టీమ్ ప‌నిచేయ‌నుంది.

Related News