logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఏపీకి మూడు రాజధానులు.. చంద్రబాబు స్పందన ఇదే!

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోద ముద్ర వేస్తూ నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై స్పందించారు. గవర్నర్ నిర్ణయాన్ని బాబు తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ నుండి చంద్రబాబు అయన స్పందనను తెలియజేసారు. ఒకవైపు కరోనాతో రాష్ట్రం బాధపడుతుంటే ఇప్పుడు కొత్తగా రాజధాని చిచ్చు పెట్టారని మండిపడ్డారు.

రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి ప్రజల ఆశల్ని సర్వనాశనం చేశారన్నారు. దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవన్నారు. బిల్లు సెలక్టు కమిటీలో ఉందని హై కోర్టు లో కూడా చెప్పారని.. అంతలోనే బిల్లులు ఆమోదించడం దుర్మార్గమన్నారు. అమరావతి ప్రజలకు జగన్ ఏం సమాధానం చెబుతారని బాబు ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్ ఇప్పుడు మాట తప్పారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో సాగుతున్న అనైతిక పాలనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినా అయన పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తుంది.. ఏపీ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని అన్నారు.

Related News