బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడా బెయిల్ సికిందరాబాద్ న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ మేరకు ఆమె శనివారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అఖిల ప్రియకు ఫోన్ చేసి మాట్లాడారు.
కేసుకు సంబందించిన వివరాలతో పాటుగా ఆమె ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకుని ముందకు వెళ్లాలని ఆమెకు ధైర్యం చెప్పారు. అదే సమయంలో తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు అఖిల ప్రియకు సూచించారు. అఖిల ప్రియకు పార్టీ క్యాడర్ అంతా అండగా ఉంటుందని బాబు హామీ ఇచ్చారు.
కాగా కిడ్నాప్ కేసులో అఖిలప్రియ దాదాపు రెండు వారాల పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అఖిల ప్రియకు మద్దతుగా టీడీపీ నేతలెవరూ ఇప్పటివరకు స్పందించలేదు. ఒక్క జేసీ పవన్ కుమార్ రెడ్డి మాత్రమే అఖిల ప్రియకు మద్దతుగా మాట్లాడారు. ఈనేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించడం విశేషం.