logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

శాశ్వ‌తంగా అధికారంలో ఉండాల‌నుకున్నా: చ‌ంద్ర‌బాబు

అధికారంలో ఎవ‌రూ శాశ్వ‌తంగా ఉండ‌లేర‌ని ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుర్తించాల‌ని, తాను కూడా శాశ్వ‌తంగా అధికారంలో ఉండాల‌నుకున్నాన‌ని, కానీ ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నాన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం మ‌హానాడు కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తాము అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తీకారం తీర్చుకోవాలంటే ఎంత సేపు అని ప్ర‌శ్నించారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం న‌వ్వుల పాలు చేసింద‌ని ఆరోపించారు. రాజ‌కీయాలంటే త‌మాషా కాద‌ని, అరాచ‌కాలు చేస్తే ఆట‌లు సాగ‌వ‌నే విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తుంచుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. తాను జిల్లాల‌కు వెళ్లాలంటే ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోవాలా అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ద‌యాదాక్షిణ్యాల మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప‌ని చేయాల‌ని అని అడిగారు. తాను చాలా మంది డీజీపీల‌ను చూశాను కానీ, ఈ త‌ర‌హా డీజీపీని మాత్రం చూడ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

Related News