logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

కోటి రూపాయ‌ల‌తో చ‌నిపోయిన వారిని బ‌తికిస్తారా..?

విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన ఎల్జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి స్పందించారు. హైద‌రాబాద్‌లోని త‌న ఇంటి నుంచి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విశాఖ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇటువంటి సమ‌యంలో విశాఖ‌కు వెళ్లలేక‌పోతున్నందుకు బాధ‌గా ఉంద‌ని, నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. విశాఖ‌కు వెళ్లేందుకు అనుమ‌తి కోసం కేంద్రానికి లేఖ రాశాన‌ని, ఇవాళ కూడా అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పారు.

కాగా, గ్యాస్ లీకేజ్ దుర్ఘ‌ట‌నపై ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరును చంద్ర‌బాబు నాయుడు త‌ప్పుప‌ట్టారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల జ‌గ‌న్ మాట‌లు వింటుంటే ప్ర‌మాద తీవ్ర‌త‌ను ఆయ‌న‌ తేలిగ్గా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ప్ర‌మాదం జ‌రిగిన ప‌రిశ్ర‌మ‌ను వెంట‌నే వేరే ప్రాంతానికి త‌ర‌లించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌మాదంపై ఐఏఎస్‌ల‌తో విచార‌ణ క‌మిటీ వేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.

ఐఏఎస్‌ల విచార‌ణ‌లో ఏం తేలుతుంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌మాద బాధితుల కుటుంబాల‌కు రూ.కోటి ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించార‌ని, ఇది ఏం స‌రిపోతుంద‌ని ప్ర‌శ్నించారు. కోటి రూపాయ‌ల‌తో చ‌నిపోయిన మ‌నుషుల‌ను బ‌తికిస్తారా అని ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ త‌ర‌పున అయ్య‌న్న‌పాత్రుడు, చిన‌రాజ‌ప్ప‌, రామానాయుడుతో క‌మిటీ వేస్తున్నామ‌ని, వారు బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ఇంకా ఏమేం చ‌ర్య‌లు తీసుకోవాలో చెబుతార‌ని పేర్కొన్నారు.

Related News