logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

జాతిర‌త్నాలు హీరోయిన్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌

చిన్న సినిమాగా వ‌చ్చిన జాతిర‌త్నాలు ఎంత పెద్ద హిట్ అందుకున్న మ‌ళ్లీ చెప్పాల్సిన ప‌ని లేదు. మంచి క‌లెక్ష‌న్ల‌తో బాక్సాఫీసు వ‌ద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమాలో న‌టించిన వారికి కూడా మంచి పేరొచ్చింది. యువ న‌టులు న‌వీన్ పొలిశెట్టికి హీరోగా మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. దీంతో న‌వీన్‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక యంగ్ క‌మెడియ‌న్లు రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి కూడా మంచి ట్యాలెంటెడ్ న‌టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే, ఈ సినిమా చూసిన అంద‌రూ సినిమాలోని కామెడీ గురించి మాట్లాడుకోవ‌డంతో పాటు హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఫ‌స్ట్ సినిమాతోనే మంచి అంద‌రినీ ఆక‌ట్టుకుంది ఈ సిక్స్ ఫీట్ బ్యూటీ. గ్లామ‌ర‌స్‌గా కాకుండా ఒక సాధార‌ణ పాత్ర‌లో న‌టించినా కూడా ఫ‌రియా కుర్ర‌కారును బాగా ఆకర్షించింది. ఆఖ‌రికి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఫ‌రియా హైట్ చూసి ఆశ్చ‌ర్య‌పోయారు,

జాతి ర‌త్నాలు సినిమాతో ఫరియాకు కూడా మంచి ఛాన్సులు వ‌స్తున్నాయి. ఏకంగా మాస్ రాజా ర‌వితేజ ప‌క్క‌న హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఫ‌రియా అబ్దుల్లా. ప్ర‌స్తుతం ర‌వితేజ ఖిలాడి అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫ‌రియా అబ్దుల్లాను ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో మంచి గ్లామ‌ర‌స్ న‌టిగా ఫ‌రియా న‌టించ‌నుంది. ఈ రోల్‌లో ఫ‌రియా ఎలా సూట్ అవుతుంద‌నేది చూడాలి. కాగా, ఇందులో ఫ‌రియాతో పాటు త‌మిళ హీరోయిన్ ఐశ్వ‌ర్య మీన‌న్‌, క‌న్న‌డ హీరోయిన్ శ్రీలి కూడా న‌టించ‌నున్నారు. ముగ్గురు హీరోయిన్ల‌లో ఫ‌రియా ఒక‌రు. మ‌రి, ఈ సినిమాలో ఫ‌రియా పాత్ర ఎలా ఉంటుంద‌నేది చూడాలి.

Related News