ఆంధ్ర మేధావుల ఫోరమ్ కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చలసాని కుమార్తె శిరీష(27) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై చలసాని ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా శిరీష ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
కానీ పెళ్ళై నాలుగేళ్లయినా పిల్లలు లేకపోవడంతో శిరీష మనస్తాపానికి గురైనట్టుగా సమాచారం. గ్రానైడ్ బిజినెస్ చేసే సిద్దార్థ తో శిరీషకు 2016 లో వివాహం జరిగింది. శిరీష ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్ సమీపంలో ఒక ఫ్లాట్ లో నివాసముంటున్నారు. కాగా సంతానం లేకపోవడంతో దంపతులిద్దరూ కొంతకాలంగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకు సంబందించిన చికిత్స కూడా తీసుకుంటున్నారు.
అయినా ఫలితం లేకపోవడంతో శిరీష మనస్తాపానికి గురైందని కుటుంబ సభ్యలు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 7:30 ప్రాంతంలో శిరీష భర్త ఇంటికి రాగా ఆమె కనిపించలేదు. ఇల్లంతా వెతకగా ఆమె గదిలోనే ఉరి వేసుకునికనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిరీష మృతి చెందినట్టుగా వైదులు నిర్దారించారు.