logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం… కీలక ప్రకటన!

కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ఓ ప్రకటన వేలాది మంది తెలంగాణ ప్రజలను నిరాశకు గురి చేసింది. ఎప్పటికైనా ప్రత్యేక పసుపు బోర్డును ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రజలకు కేంద్రం షాకిచ్చింది. నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకువచ్చే ప్రతిపాదనేదీ తమ దగ్గర లేదని, జిల్లాలో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఉండటం వల్ల ఇప్పుడు పసుపు బోర్డు సాధ్యం కాదని తెగేసి చెప్పింది. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మార్చి 10న అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దీంతో ఎంతో కాలంగా పసుపు బోర్డుపై ఆశలు పెట్టుకున్న ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తేలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాతపూర్వక హామీ ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. కేంద్రం తాజా ప్రకటనతో ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.

ఇక పసుపు బోర్డు విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా పండించే పసుపు పంటలో 70 శాతాన్ని నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లోనే పండిస్తున్నారు. అందుకే ఇక్కడ పసుపు బోర్డు ఉంటె అది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక రైతు సంఘాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటుంది. కాని ఎవ్వరూ జిల్లాకు పసుపు బోర్డును తేలేకపొయారు.

బోర్డు ఉంటె పసుపు పంటకు సంబందించిన అభివృద్ధి, విస్తరణ, నాణ్యత ఇలా అనేక విషయాలపై పరిశోధనలు జరిపి అవగాహన ఏర్పరచవచ్చు అనేది రైతు సంఘాల వాదన. మరి దీనిపై కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటి అంటే?… 1987 లో సుగంధ ద్రవ్యాల బోర్డును కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేసారు.

ఈ బోర్డు పసుపుతో కలిపి 52 రకాల సుగంధ ద్రవ్యాల కోసం పని చేస్తుంది. అందుకు సంబందించిన కార్యాలయాన్ని గతేడాది నిజామాబాద్ లో ఏర్పాటు చేసారు. కానీ ఈ బోర్డు లో పసుపు పంటకు ప్రాధాన్యత లేదని రైతులు వాదిస్తున్నారు. ప్రత్యేక బోర్డు ఉంటె రైతులకు భరోసా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News