logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

మూడు రాజధానుల అంశంపై టీడీపీకి కేంద్రం భారీ షాక్..!

ఏపీ మూడు రాజధానుల అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆ పార్టీకి భారీ షాకిచ్చింది. రాజధాని అంశంలో తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదా? లేక కేంద్ర పరిధిలోనిదా? అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్ర హోమ్ శాఖ ఈరోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తేల్చి చెప్పింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ అఫిడవిట్ లో పేర్కొంది. గతంలో ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకునే సమయంలో కూడా ఆ నిర్ణయం కేవలం రాష్ట్రానిదేనని అందులో కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదని తెలిపింది.

రాజధాని అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని ఇటీవల కొందరు హై కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ కోర్టులో కౌంటర్ పిటిషన్ ను దాఖలు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఇది భారీ ఊరటనిచ్చే విషయంగా అభిప్రాయపడుతున్నారు.

Related News