logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కేంద్ర బడ్జెట్: ఏపీకి కేంద్రం శుభవార్త!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2021-22 ఆర్థిక బడ్జెన్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త వినిపించింది. రాష్ట్ర విభజనానంతరం రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించిన కేంద్రం ఇప్పటివరకు దానిపై నోరు మెదపకపోవడంతో రైల్వే జోన్ విషయంలో తమకు అన్యాయం జరుగుతుందన్న అసంతృప్తి రాష్ట్ర వాసుల్లో ఎప్పటినుంచో ఉంది.

ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి శుభవార్త వినిపించింది కేంద్రం. ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ -కోస్ట్ సరుకు రవాణా కారిడార్ కేంద్రం ప్రకటించింది. అందుకోసం ఏకంగా రూ. 101055 కోట్లను కేటాయించింది. 2022 నాటికి తూర్పు పశ్చిమ ప్రత్యేక రవాణా కారిడార్లను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

ఈ కారిడార్ ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల రవాణా, ఇతర నిత్యావసర సరకులు ఎగుమతులు ఏపీ రాజధాని ప్రాంతం నుంచి జరగనున్నాయి. ఇతర రవాణా వ్యవస్థల కంటే రైల్వే ద్వారా రవాణా ఖర్చు తక్కువతో కూడుకుంది. సిమెంట్, ఐరన్, బొగ్గు రవాణా అధిక మొత్తంలో రవాణా చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

Related News