logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

అశ్లీల కంటెంట్ పై కేంద్రం నిఘా.. ఇకపై వారికి చుక్కలే!

కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడటంతో డిజిటల్ కంటెంట్ కు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా తీసుకుని కొత్త కొత్త కథలతో సినిమాలు తీస్తూ ఓటిటీ ప్లాట్ ఫాముల పై వదులుతున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో అభ్యంతరం ఏమీ లేకపోయినా అసలు సమస్యంతా వారు ఎంచుకుంటున్న కంటెంట్ మీదనే వస్తుంది. గతంలో సినిమాలలో ఏదైనా అశ్లీలతతో కూడిన పదాలు వాడాలన్నా, సీన్లు తీయాలన్నా దర్శక నిర్మాతలు జంకేవారు.

కారణం సెన్సార్ బోర్డు నిరాకరిస్తుంది అని. లేదంటే అవి వివాదాస్పదంగా మారి మొదటికే మోసం వస్తుందనే భయం వారిలో ఉండేది. కానీ ఈ ఓటిటీ పుణ్యమా అని ఇలాంటి ఆష్లేలతకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అశ్లీలతతో కూడిన సినిమాలను చూపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు డిజిటల్ మీడియాలోనూ ఇలాంటి కంటెంటుకు కొదువ లేకుండా పోయింది.

దీంతో ఇలాంటి వారి పనిపట్టేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. యూట్యూబ్ ఛానెల్స్, ఓటీటీలను సమాచార శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలంటే అందుకు సబంధించిన అనుమతులను పొందాల్సిందే. ఓటీటీలలోను విచ్చలవిడిగా అశ్లీల కంటెంట్ ను ప్రదర్శించకూడదను. ఇకపై ఇంటర్నెట్ లో అర్థనగ్న చిత్రాల వంటివి కనిపించకుండా కేంద్రం చర్యలు తీసుకోనుంది

Related News