logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ఇకపై అన్ని రకాల ఉద్యోగాలకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించే విధంగా కామన్ ఎలిజిబులిటీ టెస్టును తీసుకురానున్నారు. అందుకోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేసింది.

ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వరంగ బ్యాంకులకు సంబందించిన ఉద్యోగాలకు ఒకే పరీక్షను నిర్వహించి అందులో అభ్యర్థుల స్కోరును ఆధారంగా ఉద్యోగాల నియామకాలను చేపడుతుంది. ఒక్కసారి అభ్యర్థులు ఈ పరీక్షను రాస్తే మూడేళ్లవరకు ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ విధానాన్ని తీసుకురానున్నట్టుగా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం లభించడంతో ఇది కార్యరూపం దాల్చనుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పలు శాఖలలోని పోస్టులకు అభ్యర్థులు ఎన్ఆర్ఏ నిర్వహించే ఉమ్మడి పరీక్షను రాస్తే సరిపోతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగార్ధుల సమయం, డబ్బు ఆదా అవ్వనుంది.

Related News