logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కేంద్ర‌మంత్రి చేతికి డ‌బ్లూహెచ్ఓ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ప‌గ్గాలు

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్లూహెచ్ఓ) ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఛైర్మ‌న్ భార‌త వైద్యారోగ్య శాఖ మంత్రి డా.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఎన్నిక కానున్నారు. ఈ మేర‌కు ఈ నెల 22వ తేదీన ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకోవ‌డం ఖాయ‌మైంది. 34 మంది స‌భ్యుల‌తో కూడిన ఈ బోర్డుకు ఇప్ప‌టివ‌ర‌కు ఛైర్మ‌న్‌గా జ‌పాన్‌కు చెందిన‌ హిరోకి నాక‌ట‌నీ ప‌ని చేశారు. ఆయ‌న ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ఇప్పుడు డా.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కు అవ‌కాశం ల‌భించింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన వ‌ర‌ల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈ మేర‌కు నిర్ణ‌యం జ‌రిగింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైద్యారోగ్య రంగానికి సంబంధించిన 34 మంది నిపుణులు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటీవ్ బోర్డులో ఉంటారు. సంవ‌త్స‌రానికి రెండుసార్లు ఈ బోర్డు స‌మావేశం జ‌రుగుతుంది. మాన‌వాళికి ఆరోగ్య‌ప‌రంగా ఉన్న స‌వాళ్లు, వాటిని అధిగ‌మించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మావేశంలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ బోర్డుకు ఇక నుంచి ఛైర్మ‌న్ హోదాలో కేంద్ర మంత్రి డా.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ భార‌తీయుడు ఈ బోర్డుకు ఛైర్మ‌న్ కావ‌డం కీల‌కంగా మారింది.

Related News