logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

క‌రోనా నుంచి కోలుకున్న వారు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి: కేంద్రం

క‌రోనావైరస్‌కు ప్రాణాలు తీసే శ‌క్తి లేద‌ని ప్ర‌భుత్వం, వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌న దేశంలో రిక‌వ‌రీ రేటు, మ‌ర‌ణాల రేటు చూసినా ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 2 శాతానికి మించి ఉండ‌దు. ఇలా మ‌ర‌ణించే వారు కూడా కొన్ని దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో ఇబ్బంది ప‌డేవారే ఎక్కువ‌గా ఉంటున్నారు. 80 వాతం మంది హోం ఐసొలేష‌న్‌లోనే రెండు వారాల్లో కోలుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఆసుప‌త్రుల్లో చికిత్స పొంది కోలుకుంటున్నారు.

అయితే, క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, వీటి ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా స్ప‌ష్టం చేసింది. క‌రోనా నుంచి కోలుకున్న వారు చేయాల్సిన ప‌నుల గురించి కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారిలో కొన్ని రోజుల పాటు ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, ఒళ్లునొప్పులు, ఆయాసం, ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కావ‌డం వంటి ఆరోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయ‌ని తెలియ‌జేసింది. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారికి ఈ స‌మ‌స్య‌లు ఎక్కువ రోజుల పాటు కూడా ఉండ‌వ‌చ్చ‌ని కేంద్రం తెలిపింది. అయితే, ఈ స‌మ‌స్య‌ల ప‌ట్ల ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. క‌రోనా బారిన ప‌డి కోలుకున్న త‌ర్వాత కూడా ఏ మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా ఆరోగ్యప‌రంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుంద‌ని కేంద్రం చెప్పింది.

క‌రోనా నుంచి కోలుకున్న వారు కూడా ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం, శానిటైజ‌ర్ ఉప‌యోగించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం అని కేంద్రం స్ప‌ష్టం చేసింది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాల‌ని, రోజూ గోరు వెచ్చ‌టి నీటిని తాగాల‌ని చెప్పింది. బీపీ, షుగ‌ర్‌, గుండె ప‌ని తీరును, శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవెల్స్‌ను ఎప్ప‌టిక‌క‌ప్పుడు ప‌రీక్షించుకోవాల‌ని సూచించింది. ఏదైనా స‌మ‌స్య‌గా ఉంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని చెప్పింది.

“ప్ర‌తీరోజూ యోగా, ప్రాణాయామ‌, మెడిటేష‌న్ చేయాల‌ని సూచించింది. ప్ర‌తీరోజూ ఉద‌యం లేదా సాయంత్రం వేళ వాకింగ్ చేయాలి. మ‌ధ్య‌పానం, ధూమ‌పానానికి కొంత‌కాలం పాటు పూర్తిగా దూరంగా ఉండాలి. స‌రిప‌డా నిద్ర‌, విశ్రాంతి తీసుకోవాలి. బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజెస్ చేయాలి. ఆహారంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి” అని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారంతా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని చెప్పింది.

Related News