logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

వెండి తెరపై తిరుగులేని సెలబ్రిటీలు… వీరికున్న మానసిక సమస్యల గురించి తెలుసా?

సినిమా స్టార్ల జీవితాలంటే కోట్లలో సంపాదన, అభిమానులు, స్టార్ డం ఇలా ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతుంటారని అనుకుంటారు. కానీ కొంత మంది జీవితాల్లో బయటకు కనిపించని చీకటి కోణం కూడా ఉంటుంది. వెండి తెరపై వెలిగిపోయే తారల జీవితాల్లో కూడా ఎన్నో సుడిగుండాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ సమస్యలు వారిని ప్రాణాలు తీసుకునేలా చేస్తాయి. అందుకు ప్రధాన కారణం డిప్రెషన్. సామాన్య ప్రజలే కాదు వెండి తెరపై తిరుగులేని సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి భారిన పడిన వారే. కొందరు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటే మరికొందరు తారలు మాత్రం తమకు మానసిక సమస్యలు ఉన్న విషయాన్ని ధైర్యంగా బయటకు చెప్పారు. అంతేకాదు ఆ సమస్యలను దాటుకుని ఇపుడు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. వారెవరో తెలుసుకుందాం..

దీపికా పడుకునే.. ప్రస్తుతం బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే దీపిక పేరే చెప్తారు. కానీ ఒకానొక సందర్భంలో తాను డిప్రెషన్ బారిన పడ్డారని చెప్పి బాలీవుడ్ కు షాకిచ్చింది. మొదట్లో స్ట్రెస్ అనుకునేదాన్ని ఆ తర్వాత ఏ పనీ చేయలేకపోయేదాన్ని. చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరిగానే ఉండేదాన్ని. ఎంత ప్రయత్నించినా ఆ సమస్య నుంచి బయటకు రాలేక ఒక్కదాన్నే గట్టిగా ఏడ్చేసేదాన్ని అంటూ తన ఆవేదనను వెల్లడించారు. ఆ తర్వాత వైద్యుల సహాయంతో ఈ సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు దీపికా తనలాంటి వారికోసం ఓ వెల్ నెస్ సెంటర్ ను కూడా ప్రారంభించారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఒకానొక సమయంలో డిప్రెషన్ నుంచి బయటకు రాలేక సతమతమయ్యారు. తనకే కాదు తన కుటుంబంలో చాలా మందికి ఈ సమస్య ఉన్న విషయాన్ని ఆమె తెలియజేసారు. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఆమె మెడిటేషన్ చేసేవారట. అయితే ఈ విషయాన్ని తాను దాచాలనుకోలేదని అనుష్క చెప్తారు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 1996 లో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా నిర్మించిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులను మిగిల్చాయి. దీంతో ఆయన అప్పులపాలయ్యారు. అవి తీర్చే క్రమంలో అమితాబ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ సమస్య నుంచి బయటపడ్డారు.

2010 లో షారుక్ ఖాన్ తన భుజానికి ఓ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కెరీర్ పరంగా కూడా ఎన్నో నష్టాలను చూసారు. ఆ సమయంలో ఎంతో మానసిక వేదనకు గురయ్యేవాడినేనని తన కుటుంబం సహాయంతో ఈ సమస్య నుంచి బయటపడ్డానని షారుక్ తన జీవితంలోని భయంకర అనుభవాన్ని పంచుకున్నారు.

1990 నుంచి సినీ పరిశర్మలో తిరుగులేని స్టార్ డం ను చూసారు హీరొయిన్ మనీషా కొయిరాలా. అయితే ఈ క్రమంలో ఆమె తాగుడుకు బానిసయ్యారు. దానికితోడు ఆమెకు క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. ఇక మనీషా నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో ఆమె మానసిక సమస్యలను చూసారు. చివరకు క్యాన్సర్ ను జయించి ఇప్పుడు సాధారణ జీవితంలోకి అడుగుపెట్టారు.

కమల్ హాసన్ తనయ శృతి హాసన్ తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే మైకేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతనితో విడిపోయిది. ఈ క్రమంలో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది. మద్యానికి బానిసయ్యింది. ఇలా ఏకంగా మూడేళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది శృతి. చివరకు మెడిటేషన్, బుక్ రీడింగ్, మ్యూజిక్ లాంటి వాటితో మాములు స్థితికి చేరుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో శృతి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

Related News