logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మరోసారి లాక్ డౌన్ తప్పదు.. సీసీఎంబీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

యూరప్, అమెరికా దేశాలను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ భారత్ లో కూడా అడుగుపెట్టిందని, ఇప్పటికే ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందని చెప్తూ సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశప్రజలందరికీ కరోనా వాక్సిన్ అందాలంటే ఇంకో ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందన్నారు.

అలాగే కరోనాను హర్డ్ ఇమ్యూనిటీతో జయించాలంటే కనీసం 60 నుంచి 70 శాతం జనాభాకు వైరస్ సోకి యాంటీబాడీస్ వృద్ధి చెందినప్పుడే అది సాధ్యపడుతుందన్నారు. అప్పటివరకు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం వల్లనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమన్నారు. వాక్సిన్ వచ్చేవరకు ఇలాంటి వేవ్ లు వస్తూనే ఉంటాయని రాకేష్ మిశ్రా హెచ్చరించారు.

మానవ తప్పిదం వల్లనే కరోనా విజృంభిస్తుందని మరోసారి తేల్చి చెప్పారు. కొన్ని సార్లు సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ప్రమాదకారిగా మారే అవకాశముందన్నారు. పండగలు పెళ్లిళ్లలో జాగ్రత్తలు పాటించకుంటే మరోసారి లాక్ డౌన్ తప్పదని పేర్కొన్నారు.

Related News