logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

భారత లో ‘కొత్త కరోనా’.. ఆందోళన వద్దు: సీసీఎంబీ డైరెక్టర్

బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మహమ్మారి భారత్ లోకి ప్రవేశించినట్టుగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రజల్లో ఈ కొత్త స్ట్రెయిన్ పై ఎన్నో భయాలు నెలకొన్నాయి. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించగలదన్న విషయం తెలిసిందే.

కాగా ఇటీవల ఈ బ్రిటన్ నుంచి వచ్చిన 20 మంది శాంపిళ్లను పరీక్షించగా వారిలో ముగ్గురికి మాత్రం బ్రిటన్ లో వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్ లక్షణాలు బయటపడ్డాయి అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. కాగా పెద్దమొత్తంలో కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ కొత్త వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ వైరస్ కూడా సాధారణ వైరస్ లక్షణాలను కలిగి ఉందన్నారు. వీటి లక్షణాలే కాకుండా తీవ్రత కూడా తక్కువేనన్నారు. కాబట్టి అంత ప్రమాదకరంగా మారే అవకాశం లేదని ఆందోళన అవసరం లేదని రాకేష్ మిశ్రా స్పష్టం చేసారు.

అయితే భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాజిటివ్ వచ్చిన వాందరికి చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 9 వ తేదీ తర్వాత యూకే నుంచి 1216 మంది తెలంగాణకు వచ్చారు. వారిలో 1060 మందిని ఇప్పటికే గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో 156 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Related News