logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సీఎం జ‌గ‌న్‌కు మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ ఎదురుప‌డిన వేళ‌

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు ఉండ‌రు. ఆయ‌న సీబీఐ జేడీగా ఉన్న స‌మ‌యంలో ఇప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసును విచారించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ విచార‌ణ స‌మ‌యంలో ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌తి రోజూ వార్త‌ల్లో ప్ర‌ధానంగా క‌నిపించేవారు. అదే స‌మ‌యంలో సీబీఐ జ‌గ‌న్‌ను అరెస్టు చేసి జైలులో కూడా పెట్టింది. విచార‌ణ స‌మ‌యంలో లక్ష్మీనారాయ‌ణ క‌క్ష‌క‌ట్టిన‌ట్లుగా జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టార‌ని కూడా అప్ప‌ట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆరోపించారు.

 

కాగా, త‌ర్వాత ఐపీఎస్‌గా స్వచ్ఛంద ప‌దవీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన పార్టీలో చేరి విశాఖ‌ప‌ట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత ఆయ‌న జ‌న‌సేన‌కు రాజీనామా చేసి ప్ర‌స్తుతం యువ‌త‌కు రాజ‌కీయాల ప‌ట్ల చైత‌న్యం క‌ల్పించేందుకు కృషి చేస్తున్నారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు తాను ఏ పార్టీలో చేరాల‌నేది నిర్ణ‌యించుకోలేద‌ని ఆయ‌న జ‌వాబిస్తున్నారు కానీ వైసీపీలో చేర‌ను అని మాత్రం క‌చ్చితంగా చెప్ప‌డం లేదు.

 

తాజాగా ఆయ‌న ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌నితీరు ప‌ట్ల సానుకూలంగా స్పందించారు. స‌హ‌జంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను గెల‌వ‌డానికే పార్టీలు ఉప‌యోగించుకుంటాయి కానీ నెర‌వేర్చ‌య‌ని, జ‌గ‌న్ మాత్రం మేనిఫెస్టోలోని హామీల‌ను నెర‌వేర్చుందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ల‌క్ష్మీనారాయ‌ణ పేర్కొన్నారు. తాను సీబీఐ జేడీగా జ‌గ‌న్ కేసును డ్యూటీలో భాగంగానే విచారించాన‌ని, ఇందులో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఏమీ లేద‌ని చెప్పారు. ఓసారి ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్‌కు ఎదురుప‌డిన‌ప్పుడు న‌మ‌స్కారం అంటే న‌మ‌స్కారం అని ప‌ల‌క‌రించుకున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 

కాగా, ఇటీవ‌ల క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌ను కూడా ల‌క్ష్మీనారాయ‌ణ స‌మ‌ర్థించారు. జ‌గ‌న్ చెప్పిన మాట‌లు వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న స్వాగ‌తించారు. రైతు భ‌రోసా కేంద్రాల ఆలోచ‌న‌ను అభినందించారు. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలో చేర‌తారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఆయ‌న బీజేపీలోనూ చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం కూడా చాలా రోజులుగా ఉంది.

Related News