logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జ‌గ‌న్ కోప‌మే ర‌ఘురామ కృష్ణంరాజు కొంప ముంచిందా..?

త‌న పార్టీ త‌ర‌పున‌, త‌న బొమ్మ‌తో గెలిచి త‌న‌ని బాగా ఇబ్బంది పెడుతున్న ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజుకు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గన్మోహ‌న్ రెడ్డి గ‌ట్టి షాక్ ఇచ్చార‌నే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. ఊహించ‌ని రీతిలో ర‌ఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు న‌మోదు కావ‌డమే ఇందుకు కార‌ణం. ఆయ‌న‌పై ఫిర్యాదు చేసిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ముఖ్య అధికారులు ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఢిల్లీలో క‌లిసి చ‌ర్చించారు. ఆ త‌ర్వాత‌నే ర‌ఘురామ ‌కృష్ణంరాజుపై ఈ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింద‌నే ప్ర‌చారం జరుగుతోంది.

ఈ విష‌యాన్ని ర‌ఘురామ కృష్ణంరాజు కూడా ధ్రువీక‌రిస్తున్నారు. త‌న రుణానికి సంబంధించి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుతో వివాదం ఉంద‌ని తెలుసుకున్న ఓ వైసీపీ ముఖ్య నాయ‌కుడు బ్యాంకు అధికారుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌ద్ద‌కు తీసుకెళ్లార‌ని, సీబీఐకి ఫిర్యాదు చేయాల్సిందిగా ఒత్తిడి చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. దీంతో ఇంత‌కాలం త‌నను ఇబ్బంది పెట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించిన ర‌ఘురామ కృష్ణంరాజుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ‌ట్టి షాకే ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

ర‌ఘురామ కృష్ణంరాజు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి స‌న్నిహితంగా ఉండేవారు. ఆయ‌న ఆత్మ‌గా పిలిచే కేవీపీ రామ‌చంద్ర‌రావుకు వియ్యంకుడు. దీంతో వైఎస్ కుటుంబంతో రఘురామ‌కు మంచి సంబంధాలే ఉండేవి. దీంతో ఆయ‌న వైసీపీలో చేరారు. త‌ర్వాత వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి టీడీపీలో, బీజేపీలో చేరారు. 2019 ఎన్నిక‌ల ముందే మ‌ళ్లీ వైసీపీలో చేరారు. త‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తి కావ‌డంతో పాటు బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఉంటార‌ని భావించి ర‌ఘురామ కృష్ణంరాజుకు జ‌గ‌న్ న‌ర్సాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు.

అప్ప‌టి నుంచి ఢిల్లీ స్థాయిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్ల‌మెంట‌రీ క‌మిటీల్లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. బీజేపీకి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రుల‌తో స‌త్సంబంధాలు మెయిన్‌టైన్ చేస్తున్నారు. అయితే, వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీలో మాత్రం ఆయ‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తులైన విజ‌య‌సాయిరెడ్డి, మిథున్ రెడ్డికే జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చారు. మ‌రి, త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నే అసంతృప్తో, మ‌రే ఇత‌ర కార‌ణ‌మో కానీ ర‌ఘురామ కృష్ణంరాజు వైసీపీకి వ్య‌తిరేకంగా మారారు.

చిన్న చిన్న లాజిక్కుల‌తో వైసీపీని ఇరుకున పెట్ట‌డం ప్రారంభించారు. అస‌లు వైసీపీ పేరుపైనే రాద్ధాంతం మొద‌లుపెట్టారు. ప్ర‌తీరోజూ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే త‌న ప‌నిగా పెట్టుకున్నారు. అమ‌రావ‌తితో పాటు ప‌లు అంశాల్లో ప్ర‌తిప‌క్షాల‌తో చేయి క‌లిపి ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అనుకూల మీడియాకు అస్త్రంగా మారారు.

మొద‌ట్లో ర‌ఘురామ కృష్ణంరాజుపై వైసీపీ విమ‌ర్శ‌లు చేసేది. త‌ర్వాత ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసింది. ఆయ‌న చేసే విమ‌ర్శ‌ల‌ను, చ‌ర్య‌ల‌ను ఓపికగా భ‌రిస్తోంది. ఇప్పుడు ఉన్న‌ట్లుండి ర‌ఘురామ‌పై సీబీఐ కేసు న‌మోదైంది. ఇది చాలా రోజులుగా ఉన్న వివాద‌మే. త‌న ఇండ్ భార‌త్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కంపెనీ పేరు మీద ర‌ఘురామ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించ‌డం లేదు. దీంతో త‌మకు బాకీ ఉన్న రూ.826 కోట్లు చెల్లించ‌డం లేద‌ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది.

దీంతో సీబీఐ ఆయ‌న ఇళ్లు, కార్యాల‌యాల‌పై దాడులు జ‌ర‌ప‌డంతో పాటు కేసు కూడా న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో భ‌విష్య‌త్‌లో ర‌ఘురామ కృష్ణంరాజు ఇబ్బందులు ఎదుర్కునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అయితే, వైసీపీ ఎంపీ ఒక‌రు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు అధికారుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు క‌లిపించార‌ని, జ‌గ‌న్ ప్రోద్భ‌లంతోనే సీబీఐకి బ్యాంకు త‌న‌పై ఫిర్యాదు చేసింద‌నేది ర‌ఘురామ కృష్ణంరాజు ఆరోప‌ణ‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఇంత‌కాలం ర‌ఘురామ‌ను ఓపిక‌గా భ‌రించిన జ‌గ‌న్ ఇప్పుడు గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్లే.

Related News