logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

వివాదంలో కొత్త జంట.. మాజీ హీరోయిన్ పై కేసు నమోదు!

బిగ్ బాస్ నటి వనితా విజయ్ కుమార్ ఇటీవలే మూడో వివాహం చేసుకుంది. ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ను ఆమె క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకుంది. పెళ్లి రోజున వీరిద్దరూ కలిసి తీసుకున్న లిప్ లాక్ ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా పెళ్ళైన రెండు రోజులకే ఈ కొత్త జంటపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది.

వనిత పెళ్లి చేసుకున్న పీటర్ కూడా వివాహితుడే కావడంతో ఆయన మొదటి భార్య హెలెన్ వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని సమాచారం. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ వనితను పెళ్లి చేసుకున్నాడని. ఈ వివాహానికి చట్ట బద్ధత లేదని ఆమె పేర్కొంటుంది. కాగా వనితా విజయ్ కుమార్ సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె.

గతంలో దేవి సినిమాలో భాను చందర్ కు జోడీగా నటించింది. ఆమె సోదరుడు ఇటీవల సాహో సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. వనిత సోదరి జూనియర్ శ్రీ దేవి కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. కాగా వివాదాల కారణంగా వనిత తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇది వరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న వనితకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మనస్పర్థల కారణంగా వారితో విడాకులు తీసుకుని తాజాగా మూడో వివాహం చేసుకుంది.

Related News