logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు న‌మోదు

లాక్‌డౌన్ నిబంధ‌న‌లను ప్ర‌జ‌ల‌తో పాటించేలా చేయాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులే ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్నారు. వరంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పేద‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువులు అందించారు. పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌ను ఒక‌చోట కూర్చోబెట్టి సాధార‌ణ రోజుల్లో చేసిన‌ట్లుగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, భౌతిక దూరం పాటించ‌కుండా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

దీంతో బీజేపీ నేత హ‌రిశంక‌ర్ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ బ‌త్తాయి రైతుల బాధ‌ల‌ను తెలుసుకునేందుకు 10 మందితో వెళితేనే కేసులు పెట్టారని, ఇప్పుడు వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని హ‌రిశంక‌ర్‌ ఆరోపించారు. న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌పైన కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను కోరారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేసిన‌ట్లు వ‌రంగ‌ల్ అర్బ‌న్ పోలీసులు తెలిపారు.

Related News