logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

అమ‌రావ‌తిపై కీల‌క ప‌రిణామం.. అనుకున్న‌ట్లే జ‌రిగింది

అమ‌రావ‌తి రాజ‌ధాని భూకుంభ‌కోణం వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ వ్య‌వ‌హారంలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని ప్రాథ‌మిక నివేదిక‌ల ఆధారంగా ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు సంబంధించి ఇక ఏసీబీ లోతుగా విచార‌ణ జ‌ర‌ప‌నుంది. అమ‌రావ‌తిలో రాజ‌ధాని వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించ‌డానికి ముందే తెలుగుదేశం పార్టీ నేత‌లు, ఆ పార్టీ ముఖ్యుల‌కు స‌న్నిహితులు బినామీల పేర్ల‌తో దాదాపు 4,075 ఎక‌రాల‌ను కొనుగోలు చేశార‌నేది ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఈ భూమిలో 900 ఎక‌రాలు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ద‌ళితుల అసైన్‌మెంట్ భూమి కూడా ఉంది. అంతేకాదు, ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌లో బినామీల‌తో భూములు కొన్న ప్ర‌ముఖులు తెల్ల రేష‌న్ కార్డు ఉన్న వారిని బినామీలుగా పెట్టుకున్నారు. ఇటువంటి అనేక ఆరోప‌ణ‌లు అమ‌రావ‌తి భూకుంభ‌కోణంలో ఉన్నాయి. వీట‌న్నింటినీ ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సిట్‌ వేసి ఆధారాల‌ను బ‌య‌ట‌కు తీసింది.

ఈ ఆధారాల మేర‌కు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌నేది వాస్త‌వ‌మే అని తెలుసుకున్నాక ఏసీబీ విచార‌ణ‌కు ఆదేశించారు. మ‌రోవైపు వైసీపీ ఎంపీలు అమ‌రావ‌తి భూకుంభ‌కోణంలో సీబీఐ విచార‌ణ సైతం జ‌ర‌పాల‌ని పార్ల‌మెంటులో డిమాండ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాగా, ఏసీబీ కేసు న‌మోదు చేయ‌డాన్ని తెలుగుదేశం పార్టీ నేత‌లు, అమ‌రావ‌తి రైతులు వ్య‌తిరేకిస్తున్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మం నుంచి దృష్టి మ‌ళ్లించేందుకే ఈ విచార‌ణ జ‌రుపుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.

Related News