టీటీడీ బోర్డు సభ్యురాలి పదవికి సుధా నారాయణ మూర్తి రాజీనామా చేసారని జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. సుధామూర్తిపై సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలు అసత్యమని ఈ విధంగా పేస్ బుక్ లో పోస్ట్ చేసినా వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటుగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ, శ్రీవారి ఆలయ చరిత్రపై దుష్ప్రచారం చేస్తున్న మరో 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా సహించబోమని టీటీడి హెచ్చరించింది. ఓ సభలో మాట్లాడుతూ తమిళ నటుడు హీరో సూర్య తండ్రి శివకుమార్ తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తిరుమలకు వెళ్లోద్దని వివాదాస్పద పదజాలం వాడినందుకు గాను అతనిపై కేసు నమోదు చేశామని తిరుమల డిఎస్పీయే ప్రభాకర్ బాబు తెలిపారు.