logo

  BREAKING NEWS

నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |   గ్రీన్ టీతో క‌రోనాకు చెక్‌  |   తెలంగాణ ప్ర‌జ‌లారా హాయిగా ఊపిరి పీల్చుకోండి.. క‌రోనా గండం గ‌ట్టెక్కిన‌ట్లే  |   క‌రోనా వ్యాక్సిన్‌కు ముందు, త‌ర్వాత మ‌ద్యం, సిగ‌రేట్ తాగొచ్చా ?  |   క‌రోనా విజేత‌లకు 10 నెల‌లు ర‌క్ష‌ణ‌  |   Good News: అతి త‌క్కువ ధ‌ర‌కు కొత్త‌ క‌రోనా వ్యాక్సిన్‌  |  

కన్న బిడ్డల ముందు అర్థనగ్నంగా.. రెహానా ఫాతిమా పై కేసు నమోదు!

కేరళ సోషల్ ఆక్టివిస్ట్ రెహానా ఫాతిమా ఓ వివాదస్పద వీడియోను పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డారు. బుధవారం ఆమె తన కన్న బిడ్డల ముందు అర్ధనగ్నంగా ఉండగా ఆమె పిల్లలు ఆమె గుండెలపై రంగులతో పెయింటింగ్స్ వేశారు. ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట ఆమె ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. ‘కంటి సమస్యతో బాధ పడుతూ విశ్రాంతి తీసుకుంటున్న తల్లి గుండెలపై ఆమె పిల్లలు ఫోనిక్స్ బర్డ్ చిత్రం వేసి కూల్ చేసార’ని కాప్షన్ కూడా ఇచ్చారు.

కాగా కొద్దీ క్షణాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెహానా పై వివిధ వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ముందు ఇలా అర్థనగ్నంగా ఉన్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం మరింత ముదురుతుండటంతో ఓ వ్యక్తి అందించిన ఫిర్యాదు మేరకు తిరువల్ల పోలీసులు కేసు నమోదు చేసారు.

ప్రస్తుతం ఆమె ఈ విధంగా అర్థనగ్నంగా పెయింటింగ్స్ ఎందుకు వేయించుకున్నారు? ఈ వీడియోను ఎలా షూట్ చేసారు? అనే విషయంపై విచారణ జరుపుతున్నామని వారు తెలిపారు. కాగా 2018 లో తలెత్తిన శబరిమల వివాదంలో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి వివాదాస్పదమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో హిందువులపై అనుచిత పోస్టులు చేసారు. అందుకు ఆమె 18 రోజుల పటు జైలు శిక్షను కూడా అనుభవించారు.

Related News